| "జీవితాన్ని జీవితంగా చూడాలి. సినిమా భాషలో చెప్పాలంటే.. జామ్‌చేసి చూడకూడదు. వైడ్‌లోనే చూడాలి. అప్పుడే అందంగా ఉంటుంది.." అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గత మూడేళ్ళుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం గోలిమార్ చిత్రం విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్నానంటున్నారు. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: గోలిమార్ ఎంతరేంజ్‌లో హిట్ అయిందనుకుంటున్నారు?జ: రేంజ్ ఇంత అనేది చెప్పలేను. కానీ నాకు మాత్రం పూర్తి సంతృప్తికరంగా ఉంది. ప్రశ్న: ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారనే టాక్ ఉంది. ఏమైనా కోలుకున్నారా?జ: ఆర్థికంగా చాలా దెబ్బతిన్నా. నా స్థానంలో వేరే ఒకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే. ఎన్నివిధాలా మైండ్‌ను కంట్రోల్ చేసుకుని అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చా. చాలామటుకు సమస్యలు తీరిపోయాయి. ఇప్పడు చాలా హ్యాపీ. | |
| అది రామానాయుడు స్టూడియోలోని కొత్తగా కట్టిన భవంతి. అక్కడే కొత్తగా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. అందులో ఓ భాగం రానా ఆఫీస్. అక్కడికి హీరోగా కాకముందే గ్రాఫిక్ వర్క్ కోసం వస్తుండేవారు. ఇప్పుడు తను రావడం చాలా కొత్తగా ఉందనీ, అందరూ కొత్తగా గౌరవిస్తున్నారని రానా అంటున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే... ఆయనే ఎదురుగా వచ్చారు. "హాయ్ రానా..! ఎలా ఉన్నార"ని పలుకరించి...హీరో అయ్యాక ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి ఉంటారు..?నేను హీరో కాకముందు రోజూ ఇక్కడికి వచ్చేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుండేవాడిని. కానీ లీడర్ సినిమా చేశాక.. రావడం కుదరలేదు. హిందీ సినిమా షూటింగ్ కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఇక్కడికి వచ్చాను. అదే స్టాఫ్ నన్ను కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు... గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు గ్రహించాను. | |
| తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా.. వంటి చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "డార్లింగ్". ఈ చిత్రం విడుదలై పదిరోజులు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. "డార్లింగ్" సినిమాకి ప్రతిచోటా మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరుణాకరన్‌తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: "డార్లింగ్"కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?జ : ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశాను. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు కూడా ప్రభాస్ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశ్న: మీరు కథలు రాసి హీరోలను ఎంపికచేస్తారా..?జ : ముందుగా పలానా హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాను. అలా రాసుకున్నదే నా తొలిప్రేమ. అది పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అప్పటి నుంచి డార్లింగ్ వరకు హీరోను బేస్‌చేసుకునే కథ రాశాను. ప్రశ్న: "డార్లింగ్"కి ప్రభాస్ సూటయ్యాడని అనుకుంటున్నారా..?జ : సూటవుతారనే కథ రాసుకున్నాను. | |
| హ్యాపిడేస్ చిత్రంతో ప్రేక్షకులకు ఖుషీ చేసిన తెల్లపిల్ల తమన్నా ఆవారా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలుకరించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ వచ్చిన తమన్నాతో మినీ ఇంటర్య్యూ...టాలీవుడ్ - కోలీవుడ్ దేనికి ప్రాధాన్యం...?నాకు రెండూ రెండు కళ్లు లాంటివి(నవ్వు)వానపాటలో తడుస్తూ నటించడం... అసలు వానపాటలో నటించనివారు హీరోయిన్‌గా ఎదగలేరుఅంటే ఖచ్చితంగా వాన పాట చేయాలనా మీ ఉద్దేశ్యం...?అవును. ఖచ్చితంగా చేయాల్సిందే. నా చిన్నప్పుడు వేటగాడు చిత్రంలో శ్రీదేవి "ఆకుచాటు పిందె తడిసె.." వాన పాట చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా. నటిగా అవకాశం వచ్చింది కనుక వానలో తడిసే సాంగ్ చేశానంతే. | |
| హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...లీడర్‌లో అవకాశమెలా వచ్చింది...?మా నాన్నగారిది హైదరాబాద్. అమ్మగారిది చెన్నై. పెరిగింది.. చదివింది మాత్రం అమెరికాలో. అనంతరం చెన్నై వచ్చి మోడలింగ్ చేశాను. అప్పుడే "వామనన్" అనే తమిళ చిత్రంలో జై సరసన నటించే అవకాశం వచ్చింది. నా ఫోటోలను ఇంటర్నెట్‌లో చూసి లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శేఖర్ కమ్ములకు చూపించారు. రత్నప్రభ అనే పాత్రకు నేనైతే సరిపోతానని అన్నారట. | |
No comments:
Post a Comment