Saturday, June 5, 2010

new arrival

(మంగళవారం 1 జూన్ 2010)     
మణిరత్నం రూపొందిస్తోన్న "రావణ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేవ్‌ పాత్రలో తమిళ నటుడు విక్రమ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసి రాగిణి శర్మగా అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరిపై దర్శకుడు మణిరత్నం సూపర్ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. మణిరత్నం రొమాంటిక్ సన్నివేశాలంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రించిన శృంగారభరిత సన్నివేశాలను చూస్తే టీనేజ్ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతే, కొత్త దంపతులు తొలిరేయి జ్ఞాపకాలను నెమరేసుకోవలసిందే. ఈ సంగతి ప్రక్కనపెడితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. బీర అనే పాత్రలో రాగిణి శర్మను చెరబట్టే పాత్రలో నటిస్తున్నాడు. కనుక ఐష్‌ పట్ల అభిషేక్ రావణ్ అన్నమాట. ఈ చిత్రంపై ఆయా సినీపరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

No comments:

Post a Comment