Saturday, June 5, 2010

New arrivals 2010

(బుధవారం 26 మే 2010)     
కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తకిట తకిట షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 9న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 18న ఆడియో రిలీజ్ చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
(శుక్రవారం 21 మే 2010)     
ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే ప్రపంచం గడగడా వణుకుతుంది. ఈ పేరునే సినిమాకు ఉపయోగిస్తూ వాక్‌వాటర్ మీడియా బ్యానర్‌పై అభిషేక్ శర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. "తేరే బిన్ లాడెన్" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన అలీ జాఫర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇక చిత్ర విశేషాలను చూస్తే... ఇది పూర్తి హాస్యప్రధానమైన చిత్రం. అమెరికాకు వెళ్లాలన్న కలను నిజం చేసుకోవలనుకునే ఓ పాకిస్తాన్ యువ పాత్రికేయుడు పడే పాట్లను అత్యంత హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నారు. సదరు జర్నలిస్టు ఎన్నిసార్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిరాకరణకు గురవుతుంటుంది. దీంతో విసిగి వేసారిన ఆ రిపోర్టర్ ఒసామా బిన్ లాడెన్ అవతారంలోకి మారతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగిలిన సినిమా.

No comments:

Post a Comment